ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న కాామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం మొదలైంది. పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో ఓ వ్యకికి కోవిడ్ పాజిటీవ్ రావడంతో కాలనీ తో పాటు నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.
పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన 60 ఏళ్ల ముసలాయనకు జలుబు, దగ్గుతో పాటు ఇతర లక్షణాలుండడంతో గాంధి ఆస్పత్రికా తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి కోవిడ్ 19 నిర్దారించారు. అయితే సదరు వ్యక్తి అంతకు ముందు ఓ ఆర్ ఎం పీ వైద్యుని వద్ద, కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వైద్యం చేయించుకున్నట్టు తెలిసింది.
అయితే వైద్య సిబ్బంది, పోలీసులు కాలనీలో విచారణ ప్రారవభించారు. అతనితో సన్నిహింతగా ఉన్నవారిని క్వరంటైన్కు తరలిస్తున్నారు.