బాలీవుడ్ దర్శకుడు బసు చటర్జి కన్నుమూత

బాలీవుడ్ దర్శకుడు బసు చటర్జీ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళు్ల. బసు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1930 జనవరి 10న బసు అజ్మీర్‌లో జన్మించారు. సామాజిక అంశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలోనూ బసు చటర్జీకి సిద్ధహస్తుడిగా పేరుంది.

చోటీసీ బాత్, రజనీగంధ, బాతో బాతో మే, ఏక్ రుకాహువా పైసలా, చమేలీకి షాది తదితర సినిమాలకు బసు దర్శకత్వం వహించారు. హిందీతో పాటు బెంగాలీలో కూడా ఆయన అనేక సినిమాలు తీశారు.

అమితాబచ్చన్ తో మంజిల్, రాజేశ్ ఖన్నా తో చక్రవాయు, దేవానంద్తో మన్ పసంద్, మిథున్ చక్రవర్తితో శాకూన్ సీనిమాలను తీశారు పాటు పలువురు సూపర్ స్టార్లతో ఆయన సినిమా తీశారు. ఆయన దర్శకత్వం వహించిన పలు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. బసు 1996లో తీసిన ఏక్ రుకాహువా పైసలా, సినిమాను ప్రక్షకుల మనసు చూరగొంది.

సినిమాలే కాకుండా టెలివిజన్ రంగంలోనూ బసు తన ముద్ర వేశారు. దూరదర్శన్లో ప్రసారమైన బ్యోంకేశ్ బక్షి, రజని బసు చటర్జీ దర్శకత్వం వహించారు.

బసు సినిమాలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయని అంటారు. అమితాబ్ బచ్చన్‌తో మంజిల్, రాజేశ్ ఖన్నాతో చక్రవ్యూహ్, దేవానంద్‌తో తీసిన మన్ పసంద్ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.

అనేక టీవీ సీరియళ్లకు కథ, మాటలు సమకూర్చారు. సినీ రంగంలోనే కాకుండా టెలివిజన్ రంగంలోనూ బసు చటర్జీ తనదైన ముద్ర వేసుకున్నారు. దూరదర్శన్‌లో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన బ్యోంకేశ్ బక్షి, రజని బసు చటర్జీ డైరెక్ట్ చేసినవే. దూరదర్శన్‌లో ఈ రెండు సిరీస్‌లు అప్పట్లో ఓ పెను సంచలనం సృష్టించింది.

1992లో బసు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు.

Check Also

లక్షకు చేరువలో….

Print 🖨 PDF 📄 eBook 📱 తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »