గోడ దూకిన ఇద్దరు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు….
రాజ్యసభ ఎన్నికల ముందు ఎదురుదెబ్బ..
రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జీతుభాయ్ చౌదరీలు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ఎవరి ప్రమేయం లేకుండా తమ సొంత నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలపడంలో రాజీనామాలకు ఆమోదుంచినట్లు ఆరాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది ప్రకటించారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక గుజరాత్‌లోని 4 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్‌ను జారీచేసింది.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సభ్యులకు గాను బీజేపీకి 103 మంది సభ్యుల మద్దతుంది. నాలుుగు స్థానాలకు ఎన్నికలు జరుగనుండడంతో కాంగ్రస్ చెరి రెండు గెలుచుకునే అవకాశం ఉంది. ఫిరాయింపులతో ఒక స్థానాని కాంగ్రెస్ చేజార్చకోనుంది.
ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 73నుంచి 66కి చేరింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 సభ్యులకు గాను బీజేపీకి 103 మంది సభ్యుల మద్దతుంది. రెండు స్థానాలను దక్కించుకోవాలంటే విపక్ష కాంగ్రెస్‌కు 74 మంది సభ్యుల మద్దతు అవసరం కానుంది. మార్చి 26న ఈ ఎన్నిక జరుగాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.