పాఠశాలల్లో వసతుల లేమి…
సరిపోని ఇంటర్ నెట్ స్పీడ్…
కోవిడ్ తదనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి విద్యా రంగం సిద్ధంగా ఉందా… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఇది ఎలా సాధ్యమవుతున్న ప్రశ్నలు జవాబు లేకుండా మిగిలాయి. ఓ వైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనా కరోనా తీవ్రరూపం దాల్చడంతో స్కూళ్లను తెరిచే అవకాశాలు కనిపించడంలేదు. ఒకవేళ తెరిచినా తల్లిదండ్రులు పిల్లలను పంపేదుకు సాహసిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. దాంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకాల్సిన ఆవసరం ఏర్పడింది. ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసుల వైపు అడుగులు వేస్తుండగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది.
దేశంలో 40 శాతం పాఠశాలలకు కరెంటు, ఆట స్థలాలు లేవు… ఇంటర్నెట్ సౌకర్యం అందని ద్రాక్షే… తెలంగాణకు మినహాయింపు లేదు.ఈ లెర్నింగ్ ఆచరణ సాధ్యమా…
ఈ లెర్నింగ్ ఆచరణ సాధ్యమా…
ప్రవేట్ పాఠశాలల మాటటుంచితే ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్ బోధనకు సన్నద్దంగా లేవు. పాఠశాలల్లో ఈలెర్నింగ్ కు సంబంధిచిన పరికరాలు గాని వసతులుగాని లేవు. దానికితోడు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు పూర్తిగా పేద విద్యార్థులే. వీరికి చదువు చెప్పడమే భారంగా బావించే పేదలకు సెల్ ఫోన్లు అందు బాటులో లేకపోవడం పెద్ద సమస్య.
65.1 శాతం ఎస్టీలు, 50.0 శాతం ఎస్సీలు పిల్లలను ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు.
టెక్నాలజీ వాడడం సమస్యే…
టెక్నాలజీని వాడుకోవడం గ్రామీణులకు ఇంకా అలవాటు కాలేదు. స్మాట్ ఫోన్ల పుణ్యమాని వాట్సప్ లాంటి వాటిని విరివిగా వాడుతున్నా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ వాడకం ఇంకా తెలియదు. పట్టణాలు, నగరాలలో ప్రైవేట్ పాఠశాలలు జూమ్ లాంటి మీటింగ్ యాప్ లను వాడి ఇప్పటికే తరగతులను ప్రారంభించారు. అయితే ఇంటర్ నెట్ స్పీడ్ ఇబ్బంది పెడుతోంది.
ప్రత్యామ్నాయం కాదు…
తరగతి గది బోధనకు ఆన్ లైన్ బోధన ప్రత్యామ్నాయం కాదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆన్ లైన్ ద్వారా బోధిస్తే విద్యర్థులతో ఇంటరాక్షన్ ఉండదని అంటున్నారు. చెప్పిన పాఠాన్ని ఏమెరకు విద్యార్థి ఆకళింపు చేసుకున్నాడో అర్థం చేపుకోవడం కుదరదు. అయితే ప్రస్తుత పరిస్థితిలో ప్రత్యమ్నాయం లేనందునే కొద్దిరోజులు టెక్నాలజినీ వాడుకోక తప్పెటట్లు లేదు. అయితే ప్రభుత్వ పాఠశాలలు అందుకు సన్నద్ధం కావాలి.