వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల…
అలసత్వం వద్దు…
లాక్ డౌన్ సడలింపులతో అనవసరంగా బయట తిరుగొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్ సూచించారు. సడలింపులతో జనసంచారం ఎక్కువైందని దాంతో కరోనా వ్యాప్తి పెరిగిందన్నారు. ప్రజలు జాగ్రత్త పడకుంటే వైరస్ మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఆదివారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం ని ర్వహించారు.
వయోవృద్ధులు, ఆరోగ్య సమస్యలున్నవారికి ప్రమాదం..
లక్షణాలున్నవారికి హోం క్వారెంటైన్ మేలు..
సమాజం అర్థం చేసుకోవాలి..
వయోవృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారికి కరోనా వైరస్ సోకితే ప్రమాదమని, ఈ క్ర మంలో మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రభుత్వం సూచించినట్లుగా ప్రజలు జాగ్రత్త పడాలన్నారు.కరోనా లక్షణాలున్నావారు హోం క్వారంటైన్లో ఉండే అవకాశం ఉన్నా భయంతో ఇరుగు పొరుగు వారు ఇబ్బందులకు గురి చేస్తుండడంతో వారు ఆస్పత్రికి రావాల్సిన పరిస్థితి ర్పడుతోందనానరు. దాంతో రోజురోజుకీ ఆసుపత్రుల్లో ఉండే వారి సంఖ్య పెరిగితే మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు.
ప్రాథమిక లక్షణాలున్న వారికి ఆరోగ్య కేంద్రం స్థాయిలో చికిత్స..
అందరు రోగులకు హైదరాబాద్ ఆవసరం లేదు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ లక్షణాలు ఉన్న, లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ పేషంట్లను ఇంట్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రజలు, సమాజం సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ హైదరాబాద్ తీసుకువచ్చి చికిత్స అందించడం సాధ్యం కాదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, చికిత్స చేయాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు.