రాష్ట్రంలో చేస్తున్న జర్నలిస్టులకు కోవిడ్19 టెస్టులు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టు నాయకులతో ఆయన మాట్లాడారు.
విధి నిర్వహణలో జాగ్రత్త…
జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్ లే….
మాస్కులు తప్పక ధరించాలి.
డాక్టర్లు, పోలీసులతో పాటు జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్నారని ఈటల అన్నారు. ఇప్పటికీ కొందరు జర్నలిస్టులకు కోవిడ్ పరీక్షలు చేశామని, ఇక కోవిడ్ వార్తల కవరేజ్ లో ఉన్న జర్నలిస్టు లందరికీ పరీక్షలు చేయిస్తామని చెప్పారు.
వార్తల కవరేజీకి వెళ్లినప్పుడు విలేకరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో తప్పక మాస్క్ లు దరించాలని, బౌతిక దూరం తప్పక పాటించలన్నారు. ప్రతి ఒక్కరు శానిటైజర్లు వెంట ఉంచుకోవాలన్నారు.