పరువు హత్య….

జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం…

వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని..

అబార్షన్ నిరాకరించడంతో ఘూతుకం…

జోగులాంబ గద్వాల జిల్లాలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందని కన్నకూతుర్ని కడతేర్చారు. జిల్లా లోని మానపాడు మండలం కలకుంట్ల గ్గామంలో చోటు చేసుకుంది.

యువతి(20) కర్నూల్ లోని ఓ కళాాశాలలో డిగ్రీ చదువుతుంది. లాక్ డౌన్ నేపథ్యంలో సొంత ఊరికి వచ్చింది. దాంతో తల్లి దండ్రులకు యువతి గర్భం దాల్చినట్టు తెలిసింది. యువతి తన సహా విద్యార్థితో ప్రేమలో ఉందని అతని వల్లనే గర్భం దాల్చిందని తెలుసున్న తల్లి దండ్రులు అబార్షన్ చేయించు కోవాలని యువలతిపై ఒత్తిడి తెచ్చారు. అందుకు యువతి అంగీకరించడంతో హత్య కు పాల్పడ్డట్టు పోలీసులు తేల్చారు.

గత శనివారం అర్ధ రాత్రి యువతి నిద్రిస్తున్న సమయంలో తల్లి దండ్రులిరువురూ యువతిని గొతు నులిమి ఊపిరాడకుండా చేశారు. తల్లి కాళ్లు చేతులు అదిమి పట్టుకోగా తండ్రి భాస్కరయ్య బెడ్ షీట్, పిల్లో సహాయంతో అదిమి పట్టి హత్య చేసినట్టు పోలీససు దర్యాప్తులో తేలింది.

హత్య అనంతరం అనారోగ్య కారణాలతో మరణించినట్టు చిత్రీకరించే యత్నం చేశారు. స్థానిక పంచాయితి కార్యదర్శి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి విచారణ జరిపారు. శాంతి నగర్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ జె.వెంకటేశ్వర్లు దర్యాప్తు చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు పోలీసుల ఎదుట నేరం అంగీకరించారు.

Check Also

లక్షకు చేరువలో….

Print 🖨 PDF 📄 eBook 📱 తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »