బెంగాల్ ర్యాలీలో అమిత్ షా
మమత గద్దె దిగక తప్పదు….
రైతులతో రాజకీయాలు వద్దు..
కేంద్ర పథకాలు బెంగాల్ ప్రజలకు చేరకుండా మమతా బెనర్జి అడ్డుకుంటున్నారని కేంద్ర హోం మంత్రి అమిషా అన్నారు. మంగళవారం బెంగాల్ వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు
కేంద్రం రైతులకు డబ్బు పంపించాలనుకుంటుంది కాని లబ్ధిదారుల జాబితా లేక పోవడంతో అది సాధ్యం కావడంలేదని అమిషా అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు త్రుణమూల్ కాంగ్రెస్ గద్దె దించుతారన్నారు.
అన్ని వేళల రాజకీయాలు పనికి రావని ఢిల్లీ తో పాటు దేశం మొత్తం ఆయుష్మాన్ భారత్ ను అంగీకరించిందని మమత దానిని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం జాబితా ఇచ్చిన రెండు రోజుల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మార్ నిధి కింద ప్రతి రైతుకు ఆరు వేల రూపాయల చోప్పున బదిలి చేస్తామన్నారు. రాజకీయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని రైతులను అందులోకి లాగవద్దని ఆయన హితువు పలికారు.