కేసులు పరుగుతున్న నేపథ్యం….
పాఠించకుంటే చర్యలు…
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేంద్రం, ప్రభుత్వ అధికారులు మరియు సిబ్బందికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
కోవిడ్ లక్షణాలు లేని సిబ్బంది మాత్రమే డ్యూటీ కి హాజరు కావల్సి ఉంటుంది. జ్వరం లేదా తేలికపాటి దగ్గు ఉన్న ఎవరైనా ఇంట్లో ఉండి పని చేయాలి. కంటెమెంట్ జోన్లలో నివసించే అధికారులు వర్క్ ఫ్రం హోం చేయాలి
20 మందికి మించి కార్యలయానికి రావద్దు..
మిగితా వారు వర్క్ ఫ్రం హోం.
జలుబు ఇతర లక్షణాలుంటే ఇంటినుంచే పని
రోజు 20 మంది అధికారులు మాత్రమే కార్యాలయానికి హాజరుకావాలి. తదనుగునంగా తదనుగుణంగా జాబితా తయారు చేసకోవాలి. మిగితా వారుఇంటి నుండి పని చేయాలి. సక్రెటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు పని కార్యాలయానికి రావాలి.ఒక విభాగంలో ఇద్దరు అధికారులు ఉండకూడదు.
అన్ని వేళల్లో ఫేస్ మాస్క్‌లు మరియు ఫేస్ షీల్డ్స్ తప్పని సరి. ముఖాముఖి సమావేశాలకు బదులు పోన్లు ఇంటర్ కామ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకోవాలని ఆదేశించారు.
ప్రతి అర గంటకు ఒకసారి షానిటైజర్ తో గాని సబ్బుతో గాని చేతులు శుభ్ర పరుకోవాలి. ఎక్కువగా తాకే ప్రదేశాలను గంట కోసారి సోడియం హైపో క్లోరైట్ తో శుభ్రం చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.