లాక్ డౌన్ మినహాయింపులు…
దశల వారి ప్రణాలిక సిద్దం….
పదిహేను రోజుల కోసారి సమీక్ష..
జూన్ 15 నుంచి అమలు…
లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చేందుకు న్యాయవ్యవస్థ ప్రణాలిక సిద్దం చేసింది. సబార్ఢినేట్ కోర్టుల కోసం మార్గ దర్శకాలను విడుదల చేసింది. ఒక్క సారిగా కాకుండ దశల వారిగా కోర్టులు నడిచేలా ప్రణాలిక సిద్ధం చేసింది.
జూన్ 15 నుంచి కోర్టులు పాక్షికంగా నడిపిచాలని బావిస్తున్నారు. అయితే కోర్టుల్లోకి అందరిని అనుమంతించేది లేదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు హాలులోకి కేసు వాదించే న్యాయవాదులు, అందుకు సంబందించిన సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది. వారి కేసుల విచారణ పూర్తి కాగానే న్యాయవాదులు కోర్టు వదిలి వెళ్లాలి.
నాలుగు దశల ప్రణాలిక..
ఫేజ్ 1 జూన్ 15 నుంచి 30 వరకు…
ఫేజ్ 2.. జులై 1 నుంచి 15 వరకు…
పేజ్ 3…జులై 16 నుంచి ఆగస్టు 7 వరకు..
ఫేజ్ 4 ఆగస్టు 8 తదుపరి
క్లయింట్లకు కోర్టులోకి అనుమతి లేదు. 65 సంవత్సరాలు పై బడిన న్యాయవాదులు వారి వారి ఇళ్ల నుంచి ఆన్ లైన్ ద్వారా వాదనలు వినిపించాల్సి ఉంటుది. మాస్క్ లేకుంటే అనుమతించరు. బార్ అసోసియేషన్ గది తెరువడానికి వీలు లేదు.
ప్రతి రోజు మున్సిపల్ సిబ్బంది కోర్టును శుద్ధి చేయాలి. కోర్టు ప్రాంగణంలో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. కోర్టులోకి ప్రవేశించేవారు తప్పనిసరిగా చేతులను షానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. యాబై శాతం సిబ్బంది తో మాత్రమే కోర్టులు పనిచేస్తాయి. కోర్టు ప్రాంగణంలో సామాజిక దూరం తప్పని సరిగా పాటించాలి. క్యాంటీన్లకు అనుమతి లేదు.
జూన్ 15 నుంచి 30 వరకు ప్రథమ దశలో అత్యవసర కేసులు స్వీకరణ, విచారణ జరుపుతారు. కేసులు దాఖలు చేయడానికి ఆవసరమైతే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఐదేళ్లకు పైబడి పెండింగ్ లో ఉన్న కేసులకు ప్రాధన్యత ఇస్తారు.
మొదటి దశలో సజావుగా సాగితే దశల వారిగా కేసుల విచారణ సంఖ్య పెంచుతారు.