వల వేసి పట్టుకున్న నల్గోండ పోలీసులు….
వీడు మహా డేంజర్
అమ్మాయిలు జాగ్రత్త…
సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను, యువతులను హనీట్రాప్ చేసి, బ్లాక్ మెయిలింగ్ దిగి వేధించే మోసగాడిని నల్గొండ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. వందల మంది అమ్మాయిలను వేధిచిన సైకో నల్లగొండ షీటీమ్ పోలీసులు అరెస్టు చేశారు.
నల్గొండ ఎస్పీ రంగనాథ్ కేసుకు సంబంధించిన వివరాలు వెళ్లడించారు. నల్గొండ కు చెందిన అనిల్ రెండు మూడేళ్లుగా సోషల్ మీడియాను వాడుకుని అమ్మాయిలను, యువతులను ట్రాప్ చేస్తున్నాడు. ఈ కేటుగాడు నగ్నంగా ఉంటూ మహిళలకు వీడియో కాల్ చేయడం.. వారు కాల్ లిఫ్ట్ చేయగానే రికార్డ్ చేయడం చేస్తాడు తదుపరి ఆ వీడియో రికార్డులు, స్క్రీన్ షాట్ లతో బాధిత మహిళలను బ్లాక్ మెయిల్ చేసి లైంగికంగా వేధిస్తాడు.
బాధితులు 30 మంది…
కాల్ లిస్టులో 200 మంది అమ్మాయిలు
వీడి ట్రాప్ లో పడిన మహిళతో లైగిక వాంఛలు తీర్చుకోవడం బెదిరించడం చేస్తాడు. ముప్పై మంది వరకు మహిళలు వీడి బాధితుల లీస్టులో ఉన్నట్టు పోలీసు విచారణలో తేలింది. వీడి కాల్ లీస్టులో 200 మంది యువతుల నెంబర్లున్నట్టు పోలీసులు గుర్తించారు.
గతంలో సికింద్రాబాద్ లోని ఓ హోమ్ కేర్ సెంటర్ లో వార్పడు బాయ్ గా చేసేవాడు. అక్కడ పనిచేసే నర్సులను కూడా వీడు వేధించినట్టు పోలీసులు వెళ్లడించారు. జనగామ, తుకారాంగేట్, పోలీసు స్టేషన్ లలో వీడి పై కేసులున్నాయి. వీడి నేరాల చిట్టా విప్పే పనిలో పడ్డారు పోలీసులు.