కేరళలో ఆలయాల పున: ప్రారంభం పై హైదవ సంస్థల అభ్యంతరం
ఆజ్యం పోసిన కేంద్ర మంత్రి ట్వీట్
ఆలయాల్లో భక్తుల దర్శనాలను అనుమతిస్తూ కేరళలో వామపక్ష ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీసింది, ప్రభుత్వం తమను సంప్రదించలేదని మత విశ్వాసాలను విస్మరించిందని హిందూ సంఘాలు ఆరోపించాయి.
హిందూ సంస్థలు నిర్వహిస్తున్న పలు దేవాలయాల బోర్డులను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని హిందూ ధార్మక సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. జూన్ 8 నుండి కేరళలో అన్ని ప్రార్థనాలయాల్లో భక్తులకు అనుమతి ఇచ్చారు.
ఇప్పటికే రగులుతున్న ఈ అంశం కేంద్రమంత్రి వి.మురళీదరన్ చేసిన ట్వీట్ మరింత ఆజ్యం పోసింది. భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకోకుండా నాస్తికుడైన ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ తీసుకున్న తొందరపాటు నిర్ణయమని ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జే.పీ నడ్డా,హోంమంత్రి అమిత్ షా, ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.