కొత్త డిమాండ్ తో ముందుకు….
గాంధి ఆస్పత్ర వద్ద పీజీ వైద్య విద్యార్థులు చేపట్టిన ఆందోళ కొత్త డిమాండ్ ముందుకు తెచ్చారు . కోవిడ్ ట్రీట్మెంట్ ను డీసెంట్రలజ్ చేయాలన్న డిమాండ్ తో వారు ఆందోళన కొనసాగిస్తున్నారు.
గాంధి ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా వారు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ వారితో చర్చలు జరిపారు. డాక్టర్ పై జరిగిన దాడినీ సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు. ప్రతివారం డాక్టర్ల సమస్యలుపై ప్రతి వారం జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
గాంధితో పాటు రాష్ట్రంలోని ఇతర ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ 19 వైద్య సేవలు ప్రారంభంచాలన్న డిమాడ్ పెండింగ్ లో ఉంది. ముఖ్య మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన కొనసాగిస్తున్నారు.
కరోనా తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో గాంధి ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. దాంతో వైద్యులపై ఒత్తిడి తీవ్రమైంది. మరోవైపు సరియైన వైద్యం అందడంలేదంటూ రోగులనుంచి ఆరోపణలు వెల్లు వెత్తాయి. ఈ నేపథ్యం మెడికోల డిమాండ్ తెరమీదకు వచ్చింది. కోవిడ్ సేవలను డీసెంట్రలైజ్ చేస్తే వైద్యులపై ఒత్తిడి తగ్గుతుందని వారు బావిస్తున్నారు.