కరోనాతో ప్రపంచం విలవిల లాడుతుంటే చేతిని ముద్దాడి రోగం కుదురుస్తాని పలువురి ప్రాణాలతో చెలగాట మాడాడు ఓ ఫకీరు బాబా. తాను కరోనా కాటుకు బలి అయ్యాడు.
మధ్యప్రదేశ్ రత్లం జిల్లా నాయపురాలో అస్లాం బాబా కరోనా చికిత్స ప్రారంభిచాడు. స్థానికంగా భూత వైద్యునిగా పేరున్న అస్లాం బాబా కరోనా రోగుల చేతిని ముద్దు పేట్టుకుంటే రోగం కుదురుతుందని ప్రచారం చేసుకున్నాడు. ఇంకే బాబా దగ్గర వైద్యానికి రోగులు రానే వచ్చారు.
చేతిని ముద్దాడి వైద్యం అన్నాడు…..
19 మందికి వ్యాధి అంటించాడు.
చివరకు కరోనాకాటుకు బలయ్యాడు.
మధ్యప్రదేశ్ రత్లం జిల్లాలో ..
అస్లాం ముద్దుల వైద్యం ద్వారా మొత్తం 19 మందికి కరోనా అంటించాడు. మరికొన్ని కుటుంబాలు క్వారెంటైన్ కు వెళ్లాయి. ఎంత మొత్తుకున్నా ప్రజలు ఇలా చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పడు అస్లాం కాంటాక్ట్ ట్రేసింగ్ ను మొదలు పెట్టారు.
ముద్దుల ద్వారా వైరస్ వ్యాప్తి చేసన అస్లాం బాబా జూన్ 6 కరోనా రక్కసికి బలయ్యాడు. వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం రత్లం జిల్లాలో కరోనా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 85 ఇందులో 19 మంది అస్లాం ద్వారా వ్యాధి తెచ్చుకున్నవారున్నారు.