గాంధి ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు శనివారం(జూన్ 12న) విధుల్లో చేరారు. ప్రజాాఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని తిరిగి డూటీలో చేరుతున్నట్టు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది.
గాంధి ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. కేవలం గాంధిలో కాకుండా రాష్ట్రంలో ఇతర ఆస్పత్రుల్లో కూడా కరోనా చికత్సలు చేపట్టాలని డిమాండ్ తో ఆందోళన కొనసాగించారు.
తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజెందర్ జూనియర్ డాక్టర్ లతో సంప్రదింపులు జరిపారు. డాక్టర్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేశారు. దాంతో పాటు తీవ్ర శ్వాస సంబంధిత వ్యాదులతో బాధ పడే రోగులకు జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో చికిత్స అందించ నుండడంతో తాత్కాలికంగా జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరారు.
గాంధి ఆస్పత్ర వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో రక్షణ ఏర్పాటు చేసే విషయం పరిశిలిస్తామని ఈటెల జూనియర్ డాక్టర్లకు హామీ ఇచ్చారు. డాక్టర్లపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.