తెలంగాణలో కోర్టుల లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అత్యవసర కేసులతో పాటు, చివరి దశలో వాదనలకోసం ఉన్న కేసులను ఆన్ లైన్ ద్వారి కొనసాగించనున్నారు. ఇప్పటికే వాదనలు పూర్తి అయిన కేసుల్లో తీర్పులను వెళ్లడించవచ్చు.
అత్యవసర కేసులు ఆన్ లైన్ ద్వారా….
చివరి దశలో ఉన్న కేసులు కూడా…
ఫిజికల్ హియరింగ్ కు నో….
అత్యవపర కేసులను కోర్టుల్లో నేరుగా గాని, ఆన్ లైన్ ద్వారాగాని స్వీకరిస్తారు. జుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్లకు కూడా ఉత్తర్వులు వర్తిస్తాయి.
రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పొడగింపు నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తులు, సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారుల సంక్షేమాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్టు హైకోర్టు ప్రకటించింది.