బాలీవుడ్ యువ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై బాంద్రాలోని తన ఇంట్లో ఉని వేసుకుని చనిపోయి ఉండగా పనివారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
2013లో వచ్చిన కైపోచే సినిమాతో సుషాంత్ సినిమాల్లో అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అమీర్ ఖాన్ హిట్ మూవీ పీకే లో కీలక పాత్ర పోషించారు.
పవిత్ర రిష్తా, కిస్ దేశ్ మోయి హై దిల్ హమారా, జర నాచ్కే దిఖా, జిసినిమా అవార్డ్స్.2016 తదతర టీవీషొలు సుషాంత్ కు పేరుతెచ్చి పెట్టాయి.
ధోని ఆత్మకథ ధోని అన్ టోల్డ్ స్టోరీతో సినిమాతో సుషాంత్ దక్షిణాది ప్రేక్షకులకూ పరిచయమయ్యారు
కైపోచే, శద్ధ్ దేశీ రొమాన్స్, పీకే, డిటెక్టీవ్ బ్యోమేశ్ బక్షి, ఎంస్ దోని ఆన్ టోల్డ్ స్టోరీ, రాబ్త, వెల్కమ్ న్యూయార్క్ తదితర సినిమాల్లో నటించారు.
ఇంజనీరింగ్ చదివిన సుషాంత్ సినిమాల మీద మోజుతో యాక్టింగ్ వైపు వెళ్లారు. తొలుత డ్యాన్సర్ గా పని చేశారు. తరువాత సీరియల్ లలో నటించాడు. కిస్ దేశ్ మే హై హమారా సీరియల్ అతనికి పేరు తెచ్చి పెట్టింది. సీరియల్ లో పేరు తెచ్చుకున్న సుషాంత్ కు సినిమాల్లో అవకాశం వచ్చింది. మొదటి సినిమా కైపోచే తోనే మంచి పేరు సంపాదించుకున్నారు.
తాను నటించిన సినిమా చిచ్చోరే లో ఆత్మహత్యలు వద్దని సందేశం ఇచ్చాడు సుషాంత్ కాని అతనే ఆత్మహత్య చేసుకుని మరణించడం బాలివుడ్ సినిమా అభిమానులను కలచి వేస్తుంది.