చైనాలో మళ్లీ మొదలైన కరోనా…
బిజింగ్ లో పాజిటీవ్ కేసులు..
షిన్ ఫాద మార్కట్ లాక్ డౌన్
రంగంలోకి మిలటరీ…
చైనా రాజదాని బీజింగ్ లో కరోనా వైరస్ మళ్లీ తిరుగబడింది. రాజదానిలోని షిన్ ఫాది మార్కెట్లో కలకలం రేపింది. మార్కెట్ కు వెళ్లి వచ్చిన మహిళకు కరోనా సోకడంతో మార్కెట్ ను మూసి వేశారు. అక్కడ టెస్టులు చేయగా 45 మందికి కోరోనా పాజిటివ్ గా తేలింది
కరోనా ఊపిరి పోసుకున్న చైనాలో గత 52 రోజులుగా వైరస్ ప్రబావం లేక సాదారణ జీవణం కొనసాగుతోంది. ఇక చైనా వైరస్ నుంచి బయట పడినట్టే నని అందరూ బావించారు. కాని అనూహ్యంగ మళ్లీ వైరస్ తన తిరిగి తన ప్రతాపం చూపడంతో ఆందోళనకు గురి అవుతున్నారు.
బీజింగ్ నగరాన్ని లాక్ డౌన్ చేసే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బీజింగ్ నగరం మరో ఉహాన్ కానుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు ఇప్పటికే 149 మందిని క్వారెంటైన్ చేశారు. 10 వేల మందికి కోవిడ్ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటీకే 517 మందికి టెస్టులు చేయగా 45 మందికి పాజిటీవ్ గా తేలింది.