నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి పాజిటీవ్.
తెలంగాణలో మరొ శాసన సభ్యునికి కరోనా సోకింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కోవిడ్ 19 గా తేలింది. గత రెండు మూడు రోజులుగా ఆయన దగ్గు, జ్వరం తో బాధపడినట్టు సమాచారం. వైద్యులు శాపిల్స్ తీసి టెస్టు లకు పంపడంతో పాజిటీవ్ గా తేలంది. ఆయన బార్యకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది.
బాజిరెడ్డి కుటుంబ సభ్యులను క్వారెంటైన్ లో ఉంచారు. ఆయనతో తిరిగిన వారి వివరాలు సేకరిస్తున్నారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పడు ఆయనతో సన్నిహితంగా తిరిగిన వారు ఆందోళనకు గురి అవుతున్నారు.
ముత్తిరెడ్డిని కలిసిన బాజిరెడ్డి…
నియోజకవర్గంలోనూ పలు కార్యక్రమాలు…
ఆందోళనలో నాయకులు
ఇటీవలే బాజిరెడ్డి గోవర్ధన్ కోవిడ్ సోకిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కలిసినట్టు సమాచారం. ఆయన ద్వారానే వైరస్ సోకిందని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయ నాయకుల్లో కరోనా అలజడి రేపింది. మంత్రి హరీష్ రావు పీఎ కు కరొనా పాజిటీవ్ గా రావడంతో హరీష్ రావుతో పాటు ఆయన అనుచరులు పలువురు క్వారెంటైన్‌కు తరిలిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్, మరో నేత గన్ మెన్ కు పాజిటీవ్ గా రావడంతో వారు, వారి అనుచరులు క్వారెంటైన్ కు వెళ్లారు.