తెలంగాణలో వ్యవసాయ విప్లవం.
ముఖ్యమంత్రి కే సీ యార్..
ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తెలంగాణ
డిమాండ్ ఉన్న పంటల సాగు మేలు..
తెలంగాణాలోవ్యవసాయ విప్లవం చోటుచేసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ముందుచూపుతో ఆలోచించి ప్రభుత్వం నియంత్రిత సాగు వైపు అడుగులు వేస్తుందన్నారు. ఇది ఒక పంట కోసమో, ఒక సీజన్ కోసమో ఉద్దేశించింది కాదన్నారు. రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక కోణాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను, పరిష్కారాలను దృష్టిలో పెట్టుకొని సమగ్ర వ్యవసాయ అభివృద్ధి విధానం రూపొందించాం. ప్రభుత్వం ఈ యాసంగిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా లక్షా 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఇందులో 64 లక్షల టన్నులు తెలంగాణ నుంచే సేకరించింది ఉందన్నారు. దేశం మొత్తంలో 55శాతం ధాన్యం తెలంగాణ నుంచే సేకరించిందేనని ముఖ్యమంత్రి అన్నారు. ’ అని ముఖ్యమంత్రి శ్రీ పేర్కొన్నారు. ‘‘రాబోయే రోజుల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయి కోటి 30 లక్షల ఎకరాలలో బంగారు పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తున్నదన్నారు. ఇబ్బడిముబ్బడిగా ధాన్యం ఉత్పత్తి కాబోతున్న నేపథ్యంలో రాబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కే సీ యార్ అన్నారు. భవిష్యత్ లో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా మారనుందని ఆయన చెప్పారు. గతంలో అత్యధికంగా పంటలు పండించిన పజాబ్ ఎదుర్కొన్న సమస్యలను ధ్రుష్టి లో పెట్టుకుని రాష్ట్రం ముందు చూపుతో వ్యవహరిస్తుందన్నారు.