తెలంగాణలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే…
ఆందోళనలో అనుచరులు…
నిజామాబాద్ జిల్లాలో రెండో ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మేల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటీవ్ రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. గణేశ్ గుప్తా రెండు మూడు రోజులగా అనారోగ్యంగా ఉండడంతో షాంపిల్స్ తీసి టెస్టుకు పంపించగా పాజిటీవ్ రిపోర్టు వచ్చింది.
తెలంగాణలో కరోణా బారిన పడిన మూడో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా.. ఇటీవలే బాజిరెడ్డి గోవవర్ధన్ తో కాంటాక్ట్ అయినట్టు సమాచారం. జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి ద్వార బాజిరెడ్డి కి బాజిరెడ్డి ద్వారా గణేశ్ గుప్తాకు వైరస్ సోకినట్టు బావిస్తున్నారు.
ఎమ్మెల్యేలకు కరోసా పాజిటీవ్ రావడంతో వారి అనుచరులలో ఆందోళన మొదలైదంది. వీరు వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోంటున్నారు. సామాజిక దూరం అసలు పాటించకపోవడంతో ఇప్పుుడు ఎమి జరుగుతుందో అంటూ నెత్తి పట్టు కోవాల్సి న పరిస్థితి ఉంది. ఇప్పుడు అనుచరులతో పాటు వారి కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.