ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.
గ్రాామాలు శుభ్రంగా ఉండాలి.
అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు..
పక్కా ప్రణాలికతో పల్లెలను ప్రగతి బాట నడిపించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తగినన్ని నిధులున్నందున తెలంగాణ పల్లెలన్నీ బాగుపడి తీరాలన్నారు. మంగళ వారం జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.
వ్యవసాయ కూలీలకు ఉపాధి కోసం ఆవసరమైన పనుల చేపట్టడానికి నరేగా పథకాన్ని సద్వనియోగం చేయాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్ర వాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రతి ఊరు ప్రతి రోజూ శుభ్రం కావల్సిందేనని ముఖ్య మంత్రి అధికారులకు చెప్పారు. తనతో సహా రాష్ట్రంలో అధికారులెవ్వరికైనా సరే గ్రామాల పరిశుభ్రత కంటే ముఖ్య పని ఏదీ లేదని స్పష్టం చేశారు.
రాబోయే రెండు నెలల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు.
రాబోయే నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏ పని చేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని, దానికి అనుగుణంగానే పనులు చేయాలని, ఈ వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయాలని సీఎం చెప్పారు.
సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో కలెక్టర్లు, డిపిఓ ఆధ్వర్యంలో జరగాల్సిన పనులపై ముఖ్యమంత్రి మార్గదర్శకం చేశారు.