హెచ్చరించిన ఐసీఎంఆర్…
బెడ్లు, వెంటీలేటర్ల కొరత తప్పదు.
ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలతో కలవరపడుతున్న భారత్ లో నవంబర్ వరకు కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఇండియన్ కౌన్నిల్ ఫర్ మెడికల్ రీసెర్చీ సంస్థ హెచ్చరించింది.
లాక్ డౌన్ కాలంలో కేసులు కట్టడిలో ఉన్నప్పటికీ సండలింపుల అనంతరం కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. మెల్ల మెల్లగా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లోనూ తన ప్రతాపం చూపుతోంది.
ఇప్పటికీ ప్రభుత్వాలు వైద్య పరంగా పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్ధం కాలేదు. ముంబై, ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఇప్పటికే దాదాపు వెంటిలేటర్ల కొరత ఎదుర్కోంటున్నారు. ఆస్పత్రి వరకు రాని మరణాలు, కోవడ్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న వారి వివరాలు అందడంలేదు.
నవంబర్ నెలలో పరిస్థితి మరింత దిగజార వచ్చని ఐ సీ ఎం ఆర్ తెలిపుతోంది. దేశంలో వైరస్ వ్యాప్తి తీరుపై ఈ సంస్థ సర్వే నిర్వహించిది.
అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ జూన్ 9న ప్రకటించి ప్రకారం దేశంలో 958 కోవిడ్ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 1,67,883 ఐసోలేషన్ బెడ్ లు, 21,614, ఐసీయూ బెడ్ లు, 73,469 ఆక్సిజన్ సపోర్టెట్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు 1,33,037 ఐపోలేషన్ బెడలతో 2,313 కోవిడ్ హెల్త్ సెంటర్లు, 10748 ఐసీయూ బెడ్లు, 46,635 ఆక్సిజన్ తో కూడిన బెడ్లు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించిది. ప్రస్తుతం 7,525 కోవిడ్ కేర్ సెంటర్లు, 7,10,642 బెడ్లతో కోవిడ్ ను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నట్టు వివరించింది.
పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఇవి ఏ మేరకు సరిపోతాయన్నది జవాబు లేని ప్రశ్న. ఇక ఎవరికి వారు జాగ్రత్త పడడమే మేలు.