సుమంత్ గరికరాజుల
ఓప్పో కొత్త ఫోన్ లాంచ్ రద్దు…..
చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు ప్రభావం చైనా కంపెనీలకు ఇబ్బందిగా మారింది.. ప్రమఖ మొబైల్ కంపెని భారత్ లో తన కొత్త ఫోన్ లాంచ్ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఒప్పో కంపెనీ తన కొత్త బ్రాండ్ మొబైల్ ఎక్స్ 2 మొబైల్ బ్రాండ్ ను జూన్ 17 న ఆన్ లైన్ లో విడుదల చేయాల్సి ఉంది. అయితే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఒప్పో కంపెనీ ప్రకటించింది.
గాల్వన్ లోయలో జూన్ 15 జరిగిన ఘర్షన భారత సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోవడం భారతీయులను కలచి వేసింది. చైనా వ్యతిరేకత విపరీతంగా పెరిగింది. ఇక నుంచి చైనా వస్తువులను వాడొద్దన్న ప్రచారం విస్త్రుతంగా జరుగుతుండంతో అది అమ్మకాలపై ప్రభావం చూపింది.
ఒప్పో, షియోమీలతో సహా చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు భారతదేశంలో విక్రయించే ప్రతి 10 స్మార్ట్‌ఫోన్‌లలో ఎనిమిది భారత్ లో అమ్ముడవుతాయి. గ్రేట్ వాల్, ఎస్ఏఐసీ, బెటెండెన్స్, లాంటి చైనా కంపునీలు భారత మార్కెట్ పై ఆధారపడ్డాయి. అలీబాబ లాంటి పెట్టు బడిదారులు భారత్ లో అనేక అంకుర సంస్థలకు నిధులు సమకూరుస్తాయి.
మరో వైపు భారత వ్యాపారులు చైనా వస్తువుల బహిష్కరణకు సన్నద్దం అయవుతుండం కూడా చైనా వస్తువుల అమ్మకాలు గణనీయంగా పడిపోయే అవకావం ఉండడంతో చైనా కంపెనీలు బెంబేలెత్తుతున్నాయి,.
అయితే కరోనా నేపథ్యంలో భారత్ ఫోన్ ఆన్ లైన్ ఫోన్ లాంఛ్ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఒప్పో ప్రకటించింది.