భారత్ ఒక్క ఇంచు వెనక్కి తగ్గడంలేదు. ఓ వైపు సరిహద్దులో పరిస్థితిని సమీక్షిస్తూనే మరో వైపు దేశ రక్షణకోసం చేపట్టాల్సిన పనులన్నింటినీ వేగవంతం చేస్తుంది భారత్. ఇన్నాళ్లు నిర్లక్షానికి గురి అయిన సరిహద్దు రోడ్ల నిర్మాణాన్ని యుద్దప్రాతిపాదికన పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
సరిహద్దు భద్రత కట్టు దిట్టం..
రోడ్ల నిర్మణానికి బారీగా నిధులు..
వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు
భారత్ చైనా సరిహద్దులో 73 రోడ్లు నిర్మాణం జరుతోంది. వీటిలో 12 రోడ్లను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో నిర్మిస్తుండగా, 61 రోడ్లను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ మవుతున్నాయి. హోం మంత్రిత్వ శాఖ రోడ్ల నిర్మాణాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిసోంది.
హోం మత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సరిహద్దు రహదారుల నిర్మాణం త్వరితగతిన పూర్తిచెయ్యాలని నిర్ణయించారు. ఇందులో 32 రోడ్లను వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాలు యుద్ద ప్రాతిపాదికన సహకారం అంధించాలని అన్ని శాఖలను ఆదేశించారు.
ఇందులో లడక్ ప్రాంతంలో మూడు ముఖ్యమైన రోడ్లు ఉన్నాయి. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వీటిని నిర్మిస్తోంది. రహాదారులతో పాటు సరిహద్దులో విద్యుత్, వైద్యం, విద్య, టెలీకాం రంగాలను మెరుగు పర్చాలని నిర్ణయించారు.
సరిహద్దులో రోడ్ల నిర్మాణం గతంలోనే ప్రారంభించి నప్పటికీ పనులు నిదానంగా సాగాయి. 2008 నుంచి 2017 వరకు కేవలం 230 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మణానికి సంబంధించి కటింగ్ పనులు పూర్తయ్యాయి. 2017 నుంచి 2018 మధ్య కాలంలో వీటి నిర్మాణం వేగం పుంజుకుంది. ఏడాది కాలంలో 470 కిలో మీటర్ల రోడ్డు పనులు నడిచాయి. 2008 నుంచి 2014 వరకు కేవలం ఒకే ఒక్క రోడ్డు టన్నెల్ నిర్మాణం పూర్తవగా 2014 నుంచి 20 వరకు ఆరేళ్లలో ఆరు టన్నెల్ లనిర్మాణం పూర్తి చేశారు. వీటికి అదనంగా మరో 19 టన్నెల్ ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు.
2008-14లో 3,610 కిలోమీటర్ల రోడ్డు పూర్తయింది. ప 2014-20లో మొత్తం 4,764 కిలోమీటర్ల రోడ్లు నిర్మించారు. అదేవిధంగా సరిహద్దులో రోడ్ల నిర్మాణానికి సంబంధించి నిధులను కూడా భారీగా పెంచారు.
2008 నుంచి 2016 మధ్య సంవత్సరానికి రహదారి ప్రాజెక్టుల బడ్జెట్ 3,300 కోట్ల నుండి 4,600 కోట్ల రూపాయల వరకు ఉంది.2017-18లో సరిహద్దు ప్రాంతాలకు రోడ్ ప్రాజెక్టుల కోసం రూ .5450 కోట్లు, 2018-19లో రూ .6,700 కోట్లు, 2019-20లో రూ .8,050 కోట్లు, 2020-21లో రూ .11,800 కోట్లు కేటాయించారు.