సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పుడు సైన్యం నిర్ణయాలు తీసుకునేందుకు పూర్తి స్వేచ్చ నిచ్చారు. కాల్పలు జరుపరాదని ప్రస్థుతం ఉన్న కట్టుబాటును ఆవసరమైతే సడలించుకునేందుకు సైన్యానికి అనుమతినిచ్చారు. ఆయుధాలు, సామాగ్రి కొనుగోలు చేసుకునేందుకు. ఆర్మీ, నేవీ, ఏర్ ఫోర్స్ కు రూ.500 కోట్లు కేటాయించారు. ఈ మేరకు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చారు.
ఇక ఆయుధాలు వాడొచ్చు…
సైన్యానికి 500 కోట్లు…
తమ కమాండర్ చావును అంగీకరించిన చైనా..
జూన్ 15 న జరిగిన గాల్వన్ లోయలో భారత్ చైనా సరిహద్దులో జరిగిన సైనిక ఘర్షణలో తమ కమాండింగ్ ఆఫీసర్ చనిపోయినట్టు చైనా వెల్లడించినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఘర్షణలో తమ సైనికులు చనిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చిన చైనా తమ కమాండర్ చనిపోయినట్టు వెల్లడించినట్టు ఆర్మీ అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాలకు చెందిన ఆర్మీ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నారు. సోమవారం నాల్గవ రౌండ్ చర్చలు ఎల్ఏసీ ప్రాంతంలోని మోల్డలో జరిగాయి.
ముందు జూన్ 18 న, ఇరు దేశాలు మేజర్ జనరల్-స్థాయి చర్చలను ఆరు గంటలకు పైగా జరిగాయి, సమావేశం స్నేహపూర్వకంగా ముగిసింది. సమావేశం పెట్రోల్ పాయింట్ 14 వద్ద జరిగినట్టు తెలసింది. ఇక్కడే జూన్ 15-16 తేదీలలో ఇరు దేశాల బలగాలు తలపడ్డవిషయం తెలిసిందే.మే నెలకు పూర్వం ఉన్న స్థితి సరిహద్దు వెంబండి కొనసాగించాలని భారత్ డిమాండ్ చేస్తుంది.