బండారి సురేందర్ రెడ్డి
కోరలు చాచిన చైనా…
ఇబ్బడి ముబ్బడిగా పెట్టు బడులు..
లీస్టు చాంతాడంత….
టక్కరి చైనా భారత మార్కెట్ పై చేస్తున్న దండయాత్ర చేస్తోంది. అన్ని రంగాల్లో పెట్టుడులు పెడుతూ లాభాలను ఎగేసుకు పోతుంది. చివరకు మనపైనే దాడులకు తెగబడుతోంది.
చైనా నీతి లేని వ్యాపారం చేస్తోందని యూరోపియన్ యూనియన్ నివేదించింది. డ్రాగన్ యథేచ్చగా పేటెంట్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నది ప్రధాన ఆరోపణ. ప్రజాస్వామ్యం అనే పదానికి తావులేని చైనా ఇతర దేశాల మార్కెట్లను కబలించేందుకు ఎత్తు గడలు వేస్తుంది.
చైనా వస్తువులకు భారత్ అతిపెద్ద మార్కెట్. క్రికెట్ మొదలుకొని ఆన్ లైన్ గేమింగ్ వరకు చైనా తన పెట్టు బడులను విస్తరించింది. టెన్నెంట్, బిబికే ఎలక్ట్రానిక్స్, అలీబాబా వంటి బహుళజాతి చైనా కంపెనీలు క్రికెట్, ఈ స్పోర్ట్ రంగాల్లో ప్రధాన వాటాలను కలిగి ఉన్నాయి. ఆన్ లైన్ గేమింగ్ రంగంలో చైనా పెట్టు బడులే ఎక్కువే. డ్రీం 11 పేటిఎం వంటి కంపెనీలు మార్కెట్ ను కబలించి వేస్తున్నాయి. ఢ్రీం 11 సంస్థ పలు ఐపీఎల్ ఫ్రాంచేజీలలో పెట్టు బడులను పెట్టింది.
యువతను బానిసలుగా మార్చి కబలించి వేస్తున్న పబ్జి గేమ్ ను టెన్సెంట్ సంస్థ నిధులతో చైనా డెవలపర్లు తయారు చేశారు. క్రికెట్ టీంలను స్పాన్సర్ చేస్తున్న బైజూస్ చైనా కంపెనీ టెన్సెంట్ కు వాటాలున్నాయి. పేటీెఎం చైనా కంపెనీ అలీబాబ కు 37.15 శాతం వాటా ఉంది. డ్రీమ్ 11 లోనూ టెన్సెంట్ పెట్టు బడులు పెట్టింది. పీవి సింధు, కిడాంబి శ్రీకాంత్, విరాట్ కోహ్లీ తదితర ఆటగాళ్లకు చైనా కంపెనీలతో ఒప్పందాలున్నాయి.
చైనా వస్తువుల నాణ్యత పై ప్రజలకు పలు అనుమానాలున్నాయి. చైనా పరిశ్రమల్లో శ్రమ దోపిడి ఎక్కువని, అక్కడ కార్మకుల హక్కులకు దిక్కులేదని ప్రజల అభిప్రాయం. బాల కార్మికులతో పనిచేయించడం, అక్కడి పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల శ్రమ దొోపిడి చేయడం వంటి అంశాలు చైనా వస్తు బహిష్కరణకు మరో కారణంగా చెబుతున్నారు.