కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస్ తీర్పు
15కు పైగా దోపిడీలు…
అంతరాష్ట్ర ముఠా సభ్యుడు
పలు దోపిడీలతో సంబందం ఉన్న అంతరాష్ట్ర నేరస్తుడు దండ్ల బాబు అలియాస్ బాబు బాలాజీ గైక్వాడ్ అనే వ్యక్తి ఏడేళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ కామారెడ్డి అసెస్టెంట్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కామారెడ్డి జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2018 అగస్టు 21 న కామారెడ్డి పట్టణ జయశంకర్ కాలనీలో దోపిడీ జరిగింది.
కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద వాచ్ మెన్ గా ఉన్న బెల్లపు శ్రీనుపై ఐదుగురు సభ్యుల దొంగల ముఠా అర్ధ రాత్రి దాడి చేసింది. అతన్ని కర్రలతో తీవ్రంగా గాయపరిచి సెల్ ఫోన్ లాక్కున్నారు. వాచ్ మెన్ అరుపులు విని అక్కడే నివాసముండే ఒల్లెపు సాయవ్వ బయటకు రాగా ఆ మె మెడలోఉన్న పుస్తెల తాడును లాక్కెళ్లారు.
ఘటనపై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఇదే రకమైన నేరాలకు పాల్పడుతున్న ముఠాలపై పోలీసులు ద్రుష్టి సారించి దర్యాప్తు ముమ్మరం చేశారు. 2018 సెప్టెంబర్ 4 న పలు దోపిడీలతో సంబంధం ఉన్న మహారాష్ట్రకు చెందిన దెవకర్ రాజు ను నారాయణఖేడ్ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారించిన పోలీసులు ముఠాలో అతని పాటు నాందెడ్ నుంచి వచ్చి మాక్లూర్ల్ లో సెటిల్ అయిన దండ్ల బాబు, నాందెడ్ జిల్లా నండుగా గ్రామానికి చెంది మిత్కారి లక్ష్మణ్, శంబు, చంబు రాందాస్ మెహితె తదితరులు సభ్యులుగా ఉన్నట్టు తెలుసుకున్నారు.
ఏడాది క్రితం దండ్ల బాబునె పిట్లం పోలీసులు ఇంకో దోపిడీ కేసులో అరెస్టు చేయగా కామారెడ్డి పోలీసులు పీటీ వారెంట్ పై కామారెడ్డి కేసులో అదుపులోకి తీసుకున్నారు. కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు ముఠాకు సంబంధించి పూర్తి సాక్షాదారాలను కోర్టుకు సమర్పించింది.
కేసులో సాక్షాదారాలను పరిశీలించిన కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స జడ్జి వి. శ్రీనివాస్ దండ్లబాబు కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జూన్ 26 న తీర్పు చెప్పారు. కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీ.ఐలు శ్రీధర్ కుమార్, రామక్రిష్ణ, జగదీశ్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్లు లింబారెడ్డి, కాంతయ్య, కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎం.సదయ్య, ప్రాసిక్యూటర్లు వైద్య అమ్రుతరావు, నిమ్మ దామోదర్ రెడ్డి లను జిల్లా ఎస్పీ ఎన్.శ్వేత అభినందించారు.