బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా..
రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు తరలించారు.
కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు పిఎం సహాయనిధిని కూడా పక్కదారి పట్టించారని బిజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డ శుక్రవారం ఆరోపిచారు. సోనియా కుటుంబం ఆధ్వర్యంలో నడిచే రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు వాటిని తరలించారని ఆయన దుయ్యబట్టారు.
చైనా రాయబార కార్యాలయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విరాలాలు తీసుకుందని నడ్డ ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని పత్రాలను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు..
యూపీఏ హయాంతో ప్రధాన మంత్రి సహాయ నిధి బోర్డులో సోనియా గాంధి ఉన్నారు. రాజీవ్ గాంధి ఫౌండేషన్ అధ్యక్షురాలిగా ఆమెనే ఉన్నారు. ప్రజలకు అందాల్సిన సహాయ నిధిని పక్కదారి పట్టించారని నడ్డ పేర్కోన్నారు. ఇది పెద్ద కుంబ కోణం, పూర్తిగా పారదర్శకత లేని వ్యవహారమని ఆయన దుయ్యబట్టారు.
దేశ ప్రజలు కష్ట పడి పిఎం రిలీఫ్ ఫండ్ కు పంపితే దానిని సోనియా ఆధ్వర్యంలో నడిచే రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు తరలించడం పెద్ద కుంబకోణమని ట్విట్ చేశారు.
దీనికి కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పందిస్తూ చైనా ఆక్రమణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బిజెపి కపట నాటకాలు ఆడుతోందని అని ఆరోపించారు.