ఏ ఎన్ ఐ ఇంటర్వూ లో హోంమత్రి అమిత్ షా..
నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ రెండు యుద్ధాలను గెలుస్తుందని భారత హోం మంత్రి అమిత్ షా అన్నారు.. ఆదివారం ఆయన వార్త సంస్థ ఏఎన్ఐ కి ఇంటర్వూ ఇచ్చారు.సరిహద్దు సమస్య, కోవిడ్, రాహుల్ గాంధి విమర్షలపై అమిత్ షా మాట్లాడారు. ఆయన ఇంటర్వూ పూర్తి పాఠం..
దేశ రాజదాని ఢిల్లిలో కరోనా అదుపులోనికి వస్తుందని హో మంత్రి అన్నారు. జూలై చివరి నాటికి ఢిల్లిలో కోవిడ్ కేసుల సంఖ్య 5.5 లక్షలకు చేరుతుందన్న ఢిల్లి ఉప మంఖ్య మంత్రి మనీష్ సిసిడియా వాఖ్యలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యరన్నారు. అటు వంటి పరిస్థితి ఎదురుకాదని అమిత్ ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లి వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడంలేదన్నారు. ఢిల్లి ప్రభుత్వం, మున్సిపల్ కార్పోరేషన్లు, కంద్రం సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. కరోనా ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదన్నారు. సామాజిక వ్యాప్తి పై వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను ముగ్గురు సీనియర్ అధికారులతో చర్చించానని నీతి ఆయోగ్ కు చెందిన డాక్టర్ పాల్, ఐసీఎంఆర్ అధిపతి డాక్టర్ భార్గవ, న్యూ ఢిల్లి ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా లు సామాజిక వ్యాప్తి జరగలేదని చెప్పారన్నారు. ఢిల్లి లో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత లేదని చెప్పారు.
వలస కార్మికుల సమస్య పై ….
వలస కార్మికుల సమస్యలపై మాట్లడుతూ లాక్ డౌన్ మొదలయిన నాటినుంచి వలస కార్మికుల సంక్షేమంపై ద్రుష్టి సారించామన్నారు. కోటీ 20 లక్షల మంది కార్మికులను శ్రామిక్ రైళ్లు, బస్సుల ద్వారా స్వస్థలాకు తరిలించామని చెప్పారు. లాక్ డౌన్ విధించిన వెంటనే అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించామన్నారు. ప్రతి రాష్ట్రంలో వలస క్వారెంటైన్ కోసం నిధులు ఇచ్చామన్నారు. స్వస్థలాలకు నడిచి వెళ్లే క్రమంతో కొందరు కార్మికులు మరణించడం బాధాకరమని, అయితే కార్మికుల తరలింపునకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. గరీబ్ కళ్యణ్యయోజన ద్వారా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని, ఉపాధి హామీ పథకంలోనూ మార్పులు చేశామని వివరించారు.
రాహుల్ గాంధి విమర్శలపై…
గాంధి కుటుంభానికి ప్రతి పనిని తప్పు పట్టడం అలవాటైందన్నారు. కొందరికి వక్రద్రుష్టి ఉంటుందని వారికి ప్రతి పనీ తప్పుగానే అనిపిస్తుందని విమర్శించారు. భారత్ కరోనాతో సమర్థంగా పోరాడుతోందని, ఇతర దేశాలతో పోలిస్తే మన పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు.
ఛైనా, పాకిస్థాన్ లపై కాంగ్రెస్ పార్టీ వైఖరీ పై ఆత్మ విమర్శ చేసుకోవాలని అమిత్ షా సూచించారు. చైనా సరిహద్దు వివాదం మాట్లడుతూ భారత్ అన్నింట విజయం సాధిస్తుందన్నారు. చైనా కుతంత్రాలను భారత్ సమర్థంగా తిప్పి కొడుతుందన్నారు.