బండారి సురేందర్ రెడ్డి.
జోమాటో టీ షర్టులు దహనం..
ఆకలితో ఉంటా కాని చైనా కంపెనీలో పనిచేయం.
ఉద్యోగాలకూ రాజీనామా
చైనా బహిష్కరణ కు జోమాటో ఉద్యోగులు కొందరు మద్దతు పలికారు. తాము పనిచేస్తున్న సంస్థలో చైనా పెట్టు బడులున్నందుకు నిరసన తెలుపుతూ జోమాటో డెలివరీ ప్లాట్ ఫాం ఉద్యోగులు , ఆసంస్థ పెరున్న టీ షర్టులను దహనం చేశారు. గాల్వన్ లోయలో మన సైనికులను పొట్టన పెట్టుకున్న చైనా వైకరికి నిరసనగా వారు ఈ పని చేశారు.
కోల్ కత్తా లోని బెహాలలో ఈ సంఘటన జరిగింది. నిరసన కారులు తమ ఉద్యోగాలకుకూడా రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఆకలితో నైనా ఉంటాం కాని చైనా కంపెనీలో పని చేయమని వారు ప్రకటించారు.
చైనా కంపెనీలు భారతీయుల నుంచి లాభాలు గడిస్తూ మన సైనికుల పై దాడికి దిగుతున్నారని వారు నిరసన వ్యక్తం చేశారు. చైనా పెట్టుబడులతో నడుస్తున్న సంస్థ ద్వారా ఆహారం ఆర్డర్ చేయవద్దని వారు కోరారు.
చైనాకు చెందిన ఆలీబాబా కంపెనీ జొమాటోలో భారీ పెట్టు బడులు పెట్టింది. ఆ సంస్థలో భాగమైన యాంట్ ఫైనాన్సియల్ 2018 లో 210 మిలియన్ల పెట్టు బడి పెట్టి 14.7 శాతం వాటాను పొందింది. ఇటీవల యాంట్ ఫైనాన్సియల్ సంస్థ నుంచి జోమాటో మరో 150 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా సేకరించింది.