సురేందర్ రెడ్డి బండారి.
బోర్డర్ లో ప్రధాని పర్యటన….
శాంతి స్థాపనకు ధైర్యం కావాలి.
చైనాను హెచ్చరించేందుకే…
దేశ రక్షణకు సరిహద్దులో సైనికులు చూపుతున్న తెగువ, ధైర్యం గొప్పదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జన్మభూమి రక్షణ కోసం వారు చూపుతున్న అంకిత బావాన్ని ప్రధాని ప్రశంసించారు. శుక్రవారం తెల్లవారు జామున ప్రధాని లఢక్ ప్రాంతంలో భారత సరిహద్దులో పర్యటించారు. సైనికులతో మాట్లాడారు. గాల్వన్ లోయలో అమరులైన సైనికులకు నివాలి ఆర్పించారు.
‘దేశం మొత్తం మిమ్మల్ని నమ్ముతుంది’
“మిత్రులారా, మాతృభూమి పరిరక్షణకు మీ అంకితభావం సాటిలేనిది. మీరు భారతదేశాన్ని రక్షణ కోసం పడుతున్న కష్టం, మీరు సేవ చేస్తున్న అనితర సాధ్యం. ప్రపంచంలో ఎవరూ మీతో పోటీపడలేరు. మీరు చూపిన ధైర్యం, ఒక సందేశం గా మారింది. భారతదేశం యొక్క బలం ప్రపంచానికి తెలిసింది అని నరేంద్ర మోడీ సైనికులనుద్దేశించి మాట్లడారు.
గాల్వన్ లోయ ఘర్షణలో అమరులైన సైనికులకు నివాళులర్పించిన ప్రధాని దేశంలో ప్రతి చోట సైనికుల ధైర్య సాహాసాల గురించి కథలు చెప్పుకుంటున్నారు., “14 కార్ప్స్ సైనికుల ధైర్యాన్ని ప్రతిచోటా పొగుడుతున్నారు. శత్రువులు సైనికుల కోపాగ్నిని రుచి చూశారని ప్రధాని అన్నారు.
మీసంకల్ప శక్తి పర్వతాల కన్నా దృడంగా ఉంది. భారత దేశం రక్షణ మీచేతిలో ఉంచి మిమ్మల్ని నమ్మి ప్రజలు నిశ్చింతగా ఉండడాన్ని నేను చూడగలుగుతున్నాను. మీ తెగువ ప్రజలు పగలు రాత్రి కష్ట పడడానికి ప్రేరణనిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ కా సంకల్ప్ ఆప్కే త్యాగ్ బలిదాన్, పురిషార్థ్ కే ఔర్ భీ మజ్జూత్ హై.
“బలహీనులు ఎప్పటికీ శాంతిని సాధించలేరు , శాంతి స్థాపనకు ధైర్యం కావాలని మోడీ అన్నారు. వేణువుతో శాంతంగా ఉన్నా కృష్ణుడిని పూజిస్తామని అదేవిదంగా సుదర్శన చక్రంతో ఉన్న కృష్ణుడిని మనం పూజిస్తామని మనకు శాంతం తెలుసు, ధైర్యం తెలుసని మోడి సైనికులతో అన్నారు.