భారత్ లో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరుకుందని ఐఎంఏ హెచ్చరించింది. కేవలం మూడు రోజుల్లో లక్ష కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శన మని పేర్కోంది.
పరిస్థితి ప్రమదకరం…
10.76 లక్షల కరోనా బాధితులు..
27 వేల మంది ప్రాణాలు కోల్పోయారు..
ఇవి అధికారిక లెక్కలు మాత్రమే..
దేశంలో రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పల్లెలలకూ మహమ్మారి వ్యాపించింది. ఇప్పటికే ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. వైద్యం దొరుకుందో లేదో నని ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసయేషన్ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 10.76 లక్షలకు చేరుకోగా.. ఇప్పటి వరకూ దాదాపు 27వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే లక్ష కేసులు నమోదుకావడం సామూహిక వ్యాప్తికి నిదర్శనం.
మరోవైపు వ్యాధి ఇంకా సామూహిక దశకు చేరుకోలేదని కేంద్రం చెబుతోంది. వాస్తవ పరిస్థితి మాత్రం ఇప్పటికే పరిస్థితి చేజారి పోయిందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవాలకు, ప్రభుత్వాలు చెబుతున్న దానికి పొంతన కుదరడం లేదు.