సమాజ్ వాది పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ (64) శనివారం కన్ను మూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో ఆరునెలలుగా చికిత్స పొందుతున్నారు. కిడ్ని సంబంధిత వ్యాదులతో 2013 నుంచి బాధ పడుతున్నారు.
1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్.. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2016లో చివరి సారిగా పెద్దల సభకు ఎస్పీ నుంచి నామినేట్ అయ్యారు. అమర్‌సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్పీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అమర్‌సింగ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడు.
అమితా బచ్చన్ తో అమర్ సింగ్ కు సాన్నిహిత్యం ఉంది. 2003లో
2003 లో బచ్చన్ అప్పుల బారిన పడినపుడు అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎబిసిఎల్) ను పునరుద్ధరించడానికి అమర్ సింగ్ సహాయం చేశారు. కంపెనీ వైస్ చైర్మన్‌గా అడుగుపెట్టిన ఆయనను బహిరంగంగా ‘చిన్నవాడు’ అని పిలుస్తారు బిగ్ బి.