తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు పాకడం ఆందోళనకు గురిచేస్తోంది. చాలా వరకు కరోనా సోకిన వారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నప్పటికీ, సీరియస్ రోగులకు వైద్యం అందడం లేదు. ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరింది. ఐతే ఇవి కేవలం అధికారికంగా ప్రకటించిన లెక్కలు మాత్రమే.
రోజుజుకు పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. రోగం కంటే ప్రజలను అత్యవసర పరిస్థితిలో వైద్యం కరువైందన్న అశం ఎక్కువగా భయపెడుతోంది.
కరోనా బారిన పడి ఇప్పటివరకు పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 57,586గా ఉంది. కరోనాతో మరో 10 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 637కు పెరిగింది.
ప్రస్తుతం తెలంగాణలో 22,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 389 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 11,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,24,840 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో రికవరీ రేటు 71.31 శాతంగా ఉంది. కాగా జాతీయస్థాయిలో రికవరీ రేటు 68.78శాతం ఉంది.