Monthly Archives: June 2021

పట్టణ ప్రగతికి ఏర్పాట్లు చేయండి…

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నుండి జూలై పదవ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి వార్డులో 100 మంది ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మున్సిపల్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. బుధవారం ఆయన సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వారితో పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాట్లపై మాట్లాడుతూ, వార్డులలోని పిచ్చి మొక్కలను, …

Read More »

కామారెడ్డిలో డాక్టర్స్‌ డే

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్స్‌ డే పురస్కరించుకొని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కామారెడ్డి జిల్లా పక్షాన బుధవారం కలెక్టరేట్‌ సమావేశ హాలులో కామారెడ్డి జిల్లా కు చెందిన 31 మంది వైద్యాధికారులను ఘనంగా సన్మానించారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజన్న, డిప్యూటీ డిఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ శోభ వైద్యాధికారులను సన్మానించారు. అధికారుల నెలవారి …

Read More »

ఆరునెలలు సస్పెన్షన్‌ కాలం పొడిగింపు

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద కొడప్గల్‌ మండలం చిన్న తక్కడపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్‌ దేవుబాయి, ఉప సర్పంచ్‌ సంతకం లేకుండా నిధులు డ్రా చేసిన విషయంలో సర్పంచ్‌ పదవి నుండి గతంలో తాత్కాలికంగా ఆరు మాసాలపాటు సస్పెండ్‌ చేయడం జరిగిందని, సస్పెన్షన్‌ కాలం ముగిసినందున మరొక ఆరు మాసములు సెప్టెంబర్‌ 22 వరకు సస్పెన్షన్‌ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ …

Read More »

పేకాటరాయుళ్ళ అరెస్టు

నిజామాబాద్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రోజు రాత్రి సమయంలో నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలి, వారి సిబ్బంది ఏఎస్‌ఐ రామకృష్ణ నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలోని గంగస్థాన్‌ ఫేస్‌ 1 లో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు. ఈ సందర్భంగా రూ. 56 వేల …

Read More »

జూలై 22 నుంచి బి.ఎడ్‌. ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌/ బ్యాక్‌ లాగ్‌ / ఇంఫ్రూవ్‌ మెంట్‌, రెండవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంఫ్రూవ్‌ మెంట్‌ థియరీ పరీక్షలకు జూలై 22 నుంచి 27 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి …

Read More »

రెసిడెన్షియల్‌ కాలేజీల్లో పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయండి

డిచ్‌పల్లి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, ఆర్మూర్‌, కామారెడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందరను బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెసిడెన్షియల్‌ కళాశాలలోని విద్యా విధానం, బోధనా వ్యవస్థ, పరీక్షల తీరుతెన్నులను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అకడమిక్‌, స్పోర్ట్స్‌, ట్రెక్కింగ్‌, కో -కరిక్యులం కార్యక్రమాలలో రాణిస్తున్న సంగతిని వీసీకి …

Read More »

జూలై 15 వరకు కోర్టులలో వర్చువల్‌ విధానమే

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కక్షిదారులు, న్యాయవాదులు, జుడిషియల్‌ ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో జూలై 15 వరకు వర్చువల్‌ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి తెలిపారు. బుధవారం బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ కరోనా వేరియంట్లు దృష్ట్యా న్యాయవాదుల అభిప్రాయాలు స్వీకరించి నిర్ణయం తీసుకున్నట్లు …

Read More »

ఆన్‌లైన్‌ తరగతులపై అవగాహన

వేల్పూర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాల, పాథమిక పాఠశాల ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ తరగతులపై స్పెషల్‌ డ్రైవ్‌ చేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైన సందర్భంగా బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలని ప్రధానోపాధ్యాయులు సురేష్‌ అన్నారు. అలాగే మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు …

Read More »

రేవంత్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

వేల్పూర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు నీరడి భాగ్య, నూతనంగా పిసిసి అధ్యక్షులుగా రేవంత్‌ రెడ్డి ని నియమించిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు నీరడీ భాగ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధిని గ్రామ వార్డు నుండి రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ప్రజలకు …

Read More »

నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి

నిజామాబాద్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైన మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, పెరిగిన ధరలను అరికట్టాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి కే. భూమన్న, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »