నిజామాబాద్, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో హై రిస్్క ప్రజలకు ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను కలెక్టర్ నారాయణ రెడ్డి శనివారం పర్యటించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో ఎవరైతే రోజూ ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉందో ఎక్కువ హైరిస్క్ ఉన్న పీపుల్స్ కు వ్యాక్సినేషన్ చేసే విధంగా శనివారం చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో సుమారు 32 వేల మందిని గుర్తించామని సుమారు 35 వేలకు వెళ్లే అవకాశం కనపడుతుందని, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సంబంధిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రైతు బజార్ లో కూరగాయలు అమ్మే వారు వీధి వ్యాపారులు కిరాణా షాప్ లాండ్రీ షాప్, పూలు.పండ్లు. మాంసం వ్యాపారులు చిన్న హోటల్స్ లో పనిచేసే వారు స్మశాన వాటిక లో పనిచేసే వారు వారందరికీ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ శనివారం నుంచి ప్రారంభించడం జరిగిందని వచ్చే పది రోజులు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వీరికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నామని మళ్లీ 12 వారాల తర్వాత సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిషనర్ ఇచ్చిన మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఎక్కడ వ్యాక్సిన్ సెంటర్లు ఉన్నవో ఎప్పుడు వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్లాలో తెలుస్తుందని, వీరు ఎక్కువ మందిని కలిసే ఉంటారని కాబట్టి వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కుటుంబం ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రతి చిరువ్యాపారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తప్పకుండా వ్యాక్సిన్ తీసుకునే విధంగా ముందుకు రావాలన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు ఐడి కార్డు. ఆధార్ కార్డు. తీసుకొని వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందని, మీకు అనుమానం ఉంటే కమిషనర్ ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయాలని, కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే తప్పకుండా వైరస్‌తో పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని, వైరస్‌ను ఎదుర్కోవాలంటే శరీరంలో యాంటీ బాడీస్ కావాలని, అందుకోసమే వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు.
వ్యాక్సిన్ ఐసిఎంఆర్ గైడ్‌లైన్సు ప్రకారంగా ఎక్స్పర్ట్ టీన్ వ్యాక్సిన్ అప్రూవల్ చేసిన తర్వాత ప్రభుత్వం అనుమతించడం జరిగిందని జిల్లాలో ఇప్పటి వరకు రెండు లక్షల పైచిలుకు మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది అన్నారు.
వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు వైరస్ నుండి మీ బాడీని కాపాడుకోగలరని అన్నారు. అందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావలసిందిగా కోరారు.
కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, డీఎంహెచ్‌వో డాక్టర్ బాల నరేంద్ర, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ తుకారాం రాథోడ్, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.