నిజామాబాద్, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ అందించడానికి
ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు.
శనివారం స్థానిక కవిత కాంప్లెక్స్ లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా పేషెంట్లకు ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చే విధంగా కరోన విపత్కర పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం వల్ల జిల్లా ప్రజలకు ఎంతో సహాయంగా ఉంటుందని అన్నారు.
ముఖ్యంగా ప్రజలు చాలా మంది కరోనా ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ 90. 92. 93. ఉన్నప్పుడు ఇంటి దగ్గరే ఆక్సిజన్ పెట్టుకునే వారు చాలా మంది ఉండే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా పోస్టు కోవిడ్లో కూడా కొంతమందికి హాస్పిటల్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇంటి దగ్గర మళ్లీ 3 లీటర్స్ 5 లీటర్స్ సిలిండర్స్ ఆక్సిజన్ పెట్టవలసిన అవసరం ఉంటుందని, అట్లాంటి వాళ్లకు ట్రస్ట్ నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వడం అందులో కూడా చాలావరకు నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారికి చాలా హెల్ప్ అవుతుందని అన్నారు.
దీనిని నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇవ్వడానికి ముందుకు వచ్చిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యానికి ముఖ్యంగా చిరంజీవికి నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యే ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో డాక్టర్ కొండ దేవయ్య. ఏ కిషన్ రావు రాష్ట్ర సభ్యులు. జి నవీన్ కుమార్. గడిల శ్రీరాములు జిల్లా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.