కామారెడ్డి, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఆధ్వర్యం లో టాస్క్ ఫోర్స్ సీఐ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పెద్దా దేవడా గ్రామం బిచ్కుంద మండలం హన్మంతరావు వ్యవసాయ క్షేత్రంలో గుడిసె లో 23 మంది పేకాట అడుతుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి 23 మంది పేకాటరాయుళ్ళను , 21 సెల్ ఫోన్స్, 10 బైకులు , 2 లక్షల 84 వేల 500 రూపాయల నగదు సీజ్ చేసి బిచ్కుంద ఎస్ ఐ కి అప్పగించారు.