క‌రోనా బాధితునికి ఆక్సీజ‌న్ అంద‌జేత

కామారెడ్డి, జూన్ 7

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమ‌వారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్వర్యంలో కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామానికి చెందిన పెరుమాండ్ల రాజయ్య కరోనా వ్యాధితో బాధపడుతూ, దవాఖానాల్లో చేరగా చికిత్స పొందారు.

అనంతరం డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరం ఉండి, వారి కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా, షబ్బీర్ అలీ వెంటనే స్పందించి వారి ఇంటికి ఆక్సిజన్ సిలిండర్ పంపించి, ఆక్సిజన్ అందించారు.

ఈ సంద‌ర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ త‌మ నాన్న ప్రాణాలు కాపాడిన షబ్బీర్ అలీ దేవుడని, ఆయన సమయానికి ఆక్సిజన్ పంపించడం వల్ల త‌మ నాన్న ప్రాణాలు కాపాడుకోగలమని, ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామ‌న్నారు.

కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు సంతోష్, మాజీ సర్పంచ్ రాములు, ఈశ్వర్, శంకర్, షఫీ, కల్లూరు భూమయ్య, తిరుపతి, లక్క పత్తిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »