హైదరాబాద్, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తర్వాత అమలు వీలుకాని జి .ఓ. లను ఇవ్వడాన్ని బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలే భాస్కర్ వ్యతిరేకించారు.
గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ముందు రాష్ట్రంలోని రజక నాయిబ్రాహ్మణ చెందిన లాండ్రి సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటన ఆచరణకు వీలుకాని (డిజైన్ టు ఫెయిల్ కాన్సెప్ట్) షరతులు విధించడం సేవా కులాలను మళ్లీ ఒకసారి మోసం చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా సెకండ్ వేవ్ తో లాక్ డాన్ విధించడం వల్ల లాండ్రీ లు సెలూన్లు వృత్తిదారుల జీవితాలు దినదినగండంగా ఉంటే ఉచిత విద్యుత్ పేరుతో లబ్ధిదారులు కమర్షియల్ మీటర్, ట్రేడ్ లైసెన్స్ ,లేబర్ లైసెన్స్ మరియు మూడు నెలల అడ్వాన్స్ బిల్లు చెల్లింపు మొదలగు షరతులు విధించడం బాధాకరమన్నారు.
ఎలాంటి షరతులు లేని గైడ్‌లైన్స్ ఇవ్వాలని సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ పర్యవేక్షణలో విద్యుత్ సంస్థనే మీటర్లు ఏర్పాటు చేయాలని, బిసి వెల్ఫేర్ డిపార్టుమెంట్ నుండి మూడు నెలల అడ్వాన్స్ బిల్లు విద్యుత్ సంస్థకు చెల్లించే విధంగా గైడ్‌లైన్స్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలన్నారు.