బాన్సువాడ, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం హెగ్డోలి గ్రామంలో మదిమంచి వరలక్ష్మి కి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరముందని వారి కుటుంబ సభ్యులు సాంబశివరావు కూనీపూర్ రాజారెడ్డి ని సంప్రదించారు.
వెంటనే స్పందించి జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ రావ్ , యలమంచిలి శ్రీనివాస్ రావ్ లతో మాట్లాడి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పంపారు.
కూనీపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ చాలా మంది ప్రజలు ఆసుపత్రుల్లో లక్షల్లో డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని నియోజకవర్గ ప్రజలకు ఈరకమైన సేవ చేయాలని మదన్ మోహన్ రావ్ ,యలమంచిలి శ్రీనివాస్ రావ్ ఇద్దరిని కోరగా వారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరమున్న వారు కూనీపూర్ రాజారెడ్డి సెల్ నంబర్ 9553550000 కు సంప్రదించాలన్నారు.
కోటగిరి మండల మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్ మాట్లాడుతూ మదన్ మోహన్ రావ్ , యలమంచిలి శ్రీనివాస్ రావ్ లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పంపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లక్ష్మణ్ , సాంబశివరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.