కామారెడ్డి, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం పాత రాజంపేట విజయ డైరి డిడి, జెడి ఆధ్వర్యంలో స్త్రినిధి ద్వారా డైరీ ఆవు , గేదే లోన్స్ ఇవ్వడం పై అవగాహన సదస్సు విజయ డైరీ బిఎంయుసి , డైరెక్టర్స్ , ప్రెసిడెంట్స్ స్త్రినిది అవగాహన సదస్సు నిర్వహించారు.
స్త్రినిది ఆర్ ఎం / జఎడ్ ఎం టివి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో స్త్రినిది రుణాలు తీసుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పారు. విజయ డైరీ డిడి మాట్లాడుతూ స్త్రినిధి ద్వారా ఇచ్చిన ఋణాలని సద్వినియోగం చేసుకోవాలని ఆవు, గేదె కొనుగోలు చేసుకుని పాల ఉత్పత్తి పెంచుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జెడి మాట్లాడుతూ ఆవు, గేదె ఇతర రాష్ట్రాల్లో గ్రేడెడ్ ముర్ర జాతుల వలన అధిక పాల ఉత్పత్తి వస్తుందని చెప్పారు.
స్త్రినిది సీనియర్ మేనేజర్ మాట్లాడుతూ రుణాలు ఎలా తీసుకోవాలి వాటి విధి విధానాలు వివరిస్తూ ఆవు గేదె తీసుకున్న సభ్యురాలుకు స్త్రినిది సురక్ష ఇన్సూరెన్స్ మరియు గేదె లకు కూడా పశు భీమా ఇన్సూరెన్స్ 48 నెలలు ఉంటుందని వివరించారు.
బుధవారం నుండి గ్రామాల్లో సెర్ప్ , స్త్రినిది, విజయ డైరీ సిబ్బది ఆధ్వర్యంలో సంఘ సభ్యులకు , రైతులకు అవగాహన సదస్స నిర్వహించనున్నారు.
కార్యక్రమంలో స్త్రినిది సిబ్బంది జెడ్ ఎం టివి రవికుమార్, సీనియర్ మేనేజర్ శ్రీనివాస్ రాంపెళ్లి , మేనేజర్ కిరణ్, ప్రభాకర్, విజయ ప్రెసిడెంట్స్ పాల్గొన్నారు.