నిజామాబాద్, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జూన్ 30 నాటికి 45 శాతం లక్ష్యం పెట్టుకొని ఎన్ ఆర్ఈజీఎస్ పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ నుండి ఎన్ఆర్ఈజీఎస్, లేబర్ టెర్నోవర్, డోర్ టు డోర్ మూడో విడత సర్వే,
శానిటేషన్ డ్రైవ్ పైన ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 30 నాటికి లక్ష్యం చేరుకోవాలని అందుకు ఇన్ ఆక్టివ్ లేబర్ ని యాక్టివ్ చేయాలని కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని, ప్రతి గ్రూపు సభ్యులు పనికి వచ్చే విధంగా చూడాలని మేట్ తో చెక్ చేయించాలని, ఉన్న 20 రోజుల్లో 45 టార్గెట్ పెట్టుకొని పర్ఫెక్ట్ గా పనిచేసి లక్ష్యం చేరుకోవాలన్నారు.
సాయిల్ మెత్తగా ఉందని వాతావరణం బాగుందని ఇప్పుడే లేబర్ పనిచేసే విధంగా చూడాలన్నారు. ఆరు మండలాల్లో 45 శాతం జరిగిందని ఇందల్ వాయి, నిజామాబాద్, బోధన్, డిచ్‌పల్లి, నవీపేట్ ఉన్నాయన్నారు. కరోనా లక్షణాలున్న వ్యక్తులను పనికి రానివ్వకూడదని అన్నారు.
డీసిల్టింగ్ కెనాల్స్. మినీ ట్యాంకుల పనులు చేయించాలని తెలిపారు. పర్సంటేజ్ తక్కువ ఉన్నవారికి మెమోలు ఇవ్వాలని డిపివోను ఆదేశించారు. రేపటి నుంచి ఇదే పరిస్థితి ఉంటే ఇబ్బంది పడతారని తెలిపారు. పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ కోఆర్డినేషన్ తో చేయించాలన్నారు.
మూడవ విడత డోర్ టు డోర్ సర్వే గ్రామ స్థాయిలో లక్షణాలున్న వారికి బయటికి రాకుండా అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తో పంచాయతీ సెక్రెటరీ చూడాలన్నారు. లక్షణాలున్న వారికి కిట్లు ఇవ్వాలని హోం క్వారంటైన్లో ఉండే విధంగా, మందులు వాడే విధంగా చూడాలన్నారు. ఎంపీడీవోలు రాండమ్ చెక్ చేయాలని ఆదేశించారు.
శానిటేషన్ డ్రైవ్ గ్రామపంచాయతీ పాలక వర్గం యొక్క విధి అన్నారు. జిపి లో వందకు వందశాతం మెయింటెన్ కావాలన్నారు. స్పెషల్ లేబర్ ను పెట్టి డ్రైన్ డీసిల్ట్ చేయాలన్నారు. పిచ్చిమొక్కలు తొలగించాలన్నారు. నీరు నిలువకుండా చూడాలన్నారు. వారంలో పూర్తి కావాలని తెలిపారు.
వర్షాకాలం శానిటేషన్ బాగుండటం వల్ల రోగాలు రావు అన్నారు. రోడ్ సైడ్ క్లియరెన్స్ ల్యాండ్ లెవెలింగ్ గురువారం వరకు పూర్తి కావాలన్నారు. క్రిమటోరియములో రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామన్నారు.
నర్సరీ మొక్కలు జూన్ మూడవ వారం నుంచి గ్రేడింగ్. లొకేషన్. ఫిట్టింగ్ చూసుకోవాలన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గోవింద్, డి ఆర్ డి ఓ బి చందర్ నాయక్, డి పి వో జయసుధ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.