అకడమిక్ అభివృద్ధికి అడుగు వేసిన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూన్ 7

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గల ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ & ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలను సోమవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి సందర్శించారు.

ముందుగా ఆయా విభాగాలలోని అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్స్, లాబ్ అసిస్టెంట్ లు, బోధనా తరగతులు, ప్రయోగశాలలు, పరిశోధకులు, విద్యార్థుల వివరాలను విభాగాలధిపతులను అడిగి తెలుసుకున్నారు.

వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ వర్క్స్, పరిశోధనల గూర్చి తెలుసుకున్నారు. వివిధ దేశాలలోని విశ్వవిద్యాలయాలలో అధ్యాపకుల, విద్యార్థుల పరిశోధనలు, సాధించిన అవార్డులు, ప్రచురించిన వ్యాసాలు, ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్, పేటెంట్ హక్కులను గూర్చి అడిగారు.

ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ వివరాలు

ఫిజిక్స్ విత్ కెమిస్ట్రీ, హోమోజీనియస్ & హెటిరోజీనియస్, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ / ఆర్గానోమెటల్లిక్ కెమిస్ట్రీ, మెటీరియల్స్ కెమిస్ట్రీ & ఎన్విరాన్ మెంటల్ కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజి, ఇండస్ట్రియల్ సైన్స్, నానో టెక్నాలజి వంటి వైద్య రసాయన రంగాలలో నిష్ణాత సాధించారని విభాగాపతి ఆచార్య నసీం వీసీకి వివ‌రించారు.

గ్రీన్ కెమిస్ట్రీ పై పేటెంట్ సాధించామని పేర్కొన్నారు. యూజీసీ, ఐ ఎస్ ఎ, ఎస్ & టి, డి ఎస్ టి, ఎస్ ఇ ఆర్ బి, జి వి కె, ఐ ఐ టి ఎం, ఐ సి ఎం ఆర్ వంటి సంస్థల నుంచి ప్రాజెక్ట్ లను అధ్యాపకులు, పరిశోధకులు పొందినట్లుగా తెలిపారు. ఔట్ స్టాండింగ్ రివ్యూవర్, సిన్ ఫాక్ట్స్, టైంస్ రాంకింగ్ సర్వే, అసోషియేట్ ఫెలో ఆఫ్ తెలంగాణ అకాడమి ఆఫ్ సైన్స్ (టాస్), యంగ్ సైంటిస్ట్, యంగ్ ఇవిస్టిగేషన్ వంటి గుర్తింపులు అవార్డులు సాధించినట్లు వివరించారు.

అమెరిక, తైవాన్, బెల్జియం, సౌత్ ఆఫ్రిక, జర్మనీ వంటి తదితర దేశాలలో శాస్త్రవేత్తలుగా, అధ్యాపకులుగా పని చేశారని చెప్పారు. అధిక ఇంపాక్ట్ ఫాక్ట్స్ ఉన్న జర్నల్స్ లో పరిశోధనలు అచ్చు అయ్యాయని తెలిపారు.

విభాగంలోని డా. వాసం చంద్రశేఖర్, డా. శిరీష బోయపాటి, డా. సత్యనారాయణ, డా. అపర్ణ, డా. శరత్ కుమార్, డా. రామేశ్వర్, గోపినాథ్, నర్సయ్య, రమ్యశ్రీ, శ్రీకాంత్, వసుధ, విజయ, తిరుపతి తదితర సిబ్బందిని వీసికి పరిచయం చేశారు.

ఆర్గానిక్ & పార్మా కెమిస్ట్రీ వివరాలు

ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మా కెమిస్ట్రీ, హోమోజీనియస్ & హెటిరోజీనియస్, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రో వేవ్ కెమిస్ట్రీ, నాచురల్ కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సధించిన ఫ్యాకల్టీ ఉన్నట్లుగా విభాగాధిపతి డా. బాలకిషన్ వీసీకి తెలిపారు.

యు ఎస్ నుంచి ఆరు పేటెంట్ హక్కులు సాధించినట్లు పేర్కొన్నారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్ లో దాదాపు 90 ప్రచురణలు జరిగాయని, ఎనిమిది మంది పిహెచ్. డి లు సాధించారని అన్నారు. ఐ ఐ సి టి, సపల ఆర్గానిక్ లిమిటెడ్ తో ఎం ఒ యు ఒప్పందం కలిగి ఉన్నట్లు తెలిపారు.

విభాగంలో ఇద్దరికి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం, బెస్ట్ సీనియర్ సైంటిస్ట్ అవార్డ్, ఐటాప్, విద్యారత్న, గ్లోబల్ టీచర్, అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డులు వచ్చినట్లు వివరించారు. కెనడా, జపాన్ తదితర దేశాలలో శాస్త్ర సాంకేతిక పరిశోధకులుగా పని చేశారని అన్నారు. విభాగంలోని డా. నాగరాజ్, డా. సాయిలు, డా. రాజేశ్వరి, డా. డేనియల్, డా. గంగాకిషన్, డా. సురేష్, రఘువీర్ గంగాధర్ తదితర సిబ్బందిని వీసీకి పరిచయం చేశారు.

రెండు విభాగాలను సందర్శించిన వీసీ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయా విభాగాలలో జరుగుతున్న పరిశోధనలను, ప్రాజెక్ట్ లను తెలుసుకొని ప్రశంసించారు. పార్మా, రసాయనిక ప్రయోగశాలల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.

ఈ సందర్భంగా ఆర్ట్స్ & సైన్స్ కళాశాల కార్యాలయంలోని సూపరిండెంట్ ఉమారాణిని తదితర కార్యాలయ సిబ్బందిని ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్ పరిచయం చేశారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »