నందిపేట్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో 44 కరోనా కేసులు రావడంతో గత నాలుగైదు రోజులుగా జిల్లా అధికారులు కంఠం గ్రామాన్ని ప్రతి రోజు సందర్శిస్తు కరోన కట్టడి కొరకు మండల అధికారులకు దిశ నిర్దేశం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా కరోన పాజిటివిటి తగ్గి మండలంలో కూడ వంద నుండి జీరో కు తగ్గిందని అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మూడు రోజుల క్రితం కంఠం లో 44 కేసులు నమోదవడంతో మండల, జిల్లా అధికారులు అలర్ట్ అయి ఇతర గ్రామాలకు ప్రాకకుండా చర్యలు చేపట్టారు.
కంఠం గ్రామాన్నీ కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించి గ్రామానికి రాకపోకలు జరుగకుండా కట్టడి చేశారు. జిల్లా మెడికల్ హెల్త్ అధికారి బాల నరేందర్, డిప్యూటీ డి ఎం ఎచ్ ఓ రమేష్ కంఠం, ఆయిలపూర్ గ్రామాలను, నందిపేట్ పి ఎచ్ సి కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు.
కంఠం గ్రామములో పాజిటీవ్ వచ్చిన 44 కరోన రోగులందరు క్షేమంగా ఉన్నారని నందిపేట్ వైద్య అధికారి అజయ్ కుమార్ తెలిపారు. ఒకే కుటుంబములోని ఏడుగురు సభ్యులతో పాటు ఇతర బాధితులందరు ఇండ్లలోనే వుంటూ చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు.