కామారెడ్డి, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి నియోజకవర్గంలోని 70 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 24 లక్షల 15 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 735 మందికి 4 కోట్ల 57 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రి బిల్లులను తమ కార్యాలయానికి తీసుకువచ్చి ఇస్తే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి డబ్బులు ఇవ్వడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
నియోజకవర్గంలోని పేద ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.