నిజామాబాద్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నూతన సమీకృత కలెక్టరేట్ ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు.
బుధవారం బైపాస్ రహదారి సమీపములో నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో సివిల్ వర్క్స్ పూర్తి అయినందున కార్యాలయానికి ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
మీటింగ్ హాల్, కలెక్టర్ ఛాంబర్, మినిస్టర్ ఛాంబర్, వివిధ శాఖలకు కేటాయించిన గదులు
పరిశీలించారు. పెండింగ్ పనులు పూర్తి అయినవని ఫర్నిచర్ వచ్చిందని తెలిపారు. డిపార్ట్మెంటల్ వారిగా అలాట్మెంట్ పూర్తి అయిందని డిస్ప్లే బోర్డు, నంబర్స్ అలాట్మెంట్ కార్యాలయాల వారీగా బోర్డ్స్ తయారీ కి ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి ఎస్ఇ రాజేశ్వర్ రెడ్డి, ఈ ఈ రాంబాబు సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.