నందిపేట్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉచిత రేషన్ మరియు అందరికి ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో నరేంద్రమోడీ చిత్ర పటానికి భారతీయ జనతా పార్టీ నందిపేట్ మండల కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రాజు మాట్లాడుతు నరేంద్రమోడీ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులలో సమర్ధంగా ఎదుర్కొనే మోడీ లాంటి ప్రధాని మనకు దొరకడం మన దేశానికి గర్వకారణం అని కొనియాడారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెయింటర్ రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాదర్, బిజెపి సీనియర్ నాయకులు ఫోటో గంగాధర్, జిల్లా కార్యదర్శి సురేంధర్, మండల ప్రధాన కార్యదర్శి సాయికుమార్, పటేళ్ల రాజు, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నాగ సురేష్, టౌన్ కార్యదర్శి ఎంపీటీసీ భజరంగ్ చౌహన్, బిజెపి నాయకులు అరుట్ల రమేష్, కస్తూరి గంగాధర్, చింత శ్రీనివాస్, హన్మాండ్లు, మారంపల్లి సంతోష్ , బిజెవైఎం మండల అధ్యక్షుడు శ్రీకాంత్, బిజెవైఎం నాయకులు విపుల్, ప్రవీణ్, మణికంఠ, మేర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.