నిజామాబాద్ జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ సైన్ బోర్డ్, బ్రోచర్ ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆవిష్కరించారు.
బుధవారం కలెక్టరేట్లో ఐ-కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో, పట్టణాలల్లో నివసించే ప్రజలకి ఒక ఫోన్ కాల్ చేసి “ఉచిత టెలి మెడిసిన్” ద్వారా నేరుగా వైద్యసేవలు అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు.
ఐ – కేర్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో టెలి మెడిసిన్ ప్రాజెక్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం ఉచిత శానిటైజ్ బ్యాటిల్స్, మాస్క్ ల కిట్లను పంపిణి చేయడం జరిగిందని, లాక్ డౌన్ సమయంలో జిల్లా ప్రజలకు ఉచిత టెలి మెడిసిన్ ఎంతగానో ఉపయోగ పడుతుందని ప్రజలు టెలి మెడిసిన్ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు వల్ల జిల్లా ప్రజలకు లాక్ డౌన్ సమయంలో ఎంతో ఉపయోగ పడుతుంది అని, కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఐ-కేర్ ఫౌండేషన్ సభ్యులకు అభినందించారు.
ప్రజలు ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు టెలి వైద్య సేవలు 950 5553 108, 950 5554 108 నంబర్స్ కి కాల్ చేసి సేవలు పొందవచ్చు అని అన్నారు.
కార్యక్రమంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, నరేషగౌడ్, తాడేం సురేష్, నరేశ్ గౌడ్, మహేష్ యాదవ్, రాజశేఖర్, మధు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.